News April 21, 2024

బోధన్: బాలికపై అత్యాచారం

image

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని  ఓ గ్రామానికి చెందిన వ్యక్తి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వేరే మండలానికి చెందిన బాలిక (17) బంధువుల ఇంటికి ఇటీవల వచ్చింది. మాయమాటలు చెప్పి సదరు వ్యక్తి బాలకను లొంగదీసుకున్నాడు. బాలిక తరఫు బంధువులకు ఆలస్యంగా విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని గ్రామీణ   ఎస్సై నాగనాథ్ తెలిపారు.

Similar News

News March 19, 2026

నిజామాబాద్: ‘SSC పేపర్ లీక్.. 9 మంది సిబ్బందిపై వేటు’

image

10th పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9మంది సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బుధవారం జరిగిన 2వ భాష (హిందీ/తెలుగు) ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం.​ ఆలూరు, మెండోరా, బోధన్ పరిధిలోని పరీక్షాకేంద్రాల నుంచి ఈ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 9మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించి సస్పెన్షన్ వేటువేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు.

News March 18, 2026

వైద్య సేవల్లో అలసత్వం వద్దు: డీఎంహెచ్‌ఓ

image

జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.రాజశ్రీ స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆర్బీఎస్‌కే వైద్యులతో ఆమె ‘జూమ్‌’ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలను మెరుగుపరచాలని, నిర్దేశించిన లక్ష్యాలను సకాలం పూర్తి చేయాలని ఆదేశించారు.