News April 21, 2024
సంగారెడ్డి: పిడుగుపాటుకు రెండు పశువులు మృతి

పిడుగుపాటుకు పశువులు మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. దొమ్మాటకు చెందిన సందీప్ రెడ్డి ఆవు పిడుగు పాటుకు మృతిచెందగా రూ.95 వేల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. గాజులపల్లికి చెందిన దాసరి నర్సింలు ఎద్దు పిడుగు పాటుకు మృతి చెందగా రూ.65 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు నర్సింలు వాపోయారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు.
Similar News
News March 15, 2026
పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మధ్యాహ్నం పాఠశాల ముగిశాక పిల్లలు ఉత్సాహంతో చెరువులు, కుంటలకు ఈతకు వెళ్లే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సరదా ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన స్పష్టం చేశారు.
News March 14, 2026
జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.
News March 14, 2026
మెదక్ జిల్లాలో 99.83% హాజరు నమోదు: డీఈవో

మెదక్ జిల్లాలో పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు) పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిందని డీఈవో విజయ తెలిపారు. హవేలీఘన్పూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 11,239 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11,220 మంది హాజరై 19 మంది గైర్హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారిలో 14 మందికి 9 మంది పరీక్ష రాయగా హాజరు శాతం 99.83గా నమోదైందని పేర్కొన్నారు.


