News December 17, 2025
‘సర్పంచ్’ రిజల్ట్స్.. ఒక్క ఓటుతో..

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా నలబండబోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీపై బీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 139 ఓట్లు పోలవ్వగా ఝాన్సీకి 69, సింధుకి 70 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి(D) బాణాపూర్‌లోనూ ఇదే రిజల్ట్ రిపీటైంది. శంకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.
Similar News
News January 14, 2026
క్యాబినెట్ అజెండాలోకి ‘నల్లమలసాగర్’

TG: నల్లమలసాగర్ ప్రాజెక్టుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18న మేడారంలో జరిగే క్యాబినెట్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. నల్లమలసాగర్‌పై APని కట్టడిచేసేలా న్యాయపరమైన అంశాలన్నిటినీ దీనిలో చర్చించనుంది. ఇటీవల వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని SC చెప్పడంతో TG ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సివిల్ దావాను పగడ్బందీగా దాఖలు చేసేందుకు నిర్ణయించింది.
News January 14, 2026
కుంకుమాది తైలంతో చర్మ సంరక్షణ

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్‌లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.
News January 14, 2026
అపరాల పంటల్లో తెల్లదోమను ఎలా నివారించాలి?

తెల్లదోమ అపరాల పంట ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు పాలిపోయి నల్లగా కనబడతాయి. అంతేకాకుండా ఎల్లో మొజాయిక్ (పల్లాకు తెగులు) అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపజేస్తాయి. పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గుర్తించి కాల్చివేయాలి. తెల్లదోమ నివారణకు పొలంలో ఎకరానికి 20-25 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. లీటరు నీటికి 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేయాలి.


