News December 17, 2025

తిరుపతి: స్టార్టప్ వ్యవస్థ బలోపేతంపై ఒప్పందం

image

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, SSIIE-టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (TBI), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) తిరుపతి మధ్య స్టార్టప్ వ్యవస్థ బలోపేతంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ సందర్భంగా VC ఉమా మాట్లాడుతూ.. ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇన్నోవేటివ్, డీప్ టెక్ ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ మేరకు MOUపై సంతకాలు చేశారు.

Similar News

News January 13, 2026

అజాగ్రత్త వద్దు.. రోడ్డు నియమాలు పాటించండి: ఎస్పీ

image

వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సుజాతనగర్లో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి బసిత్ రెడ్డి పాల్గొన్నారు.

News January 13, 2026

సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో పండగ వేళ నాన్‌వెజ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏపీలోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లో కేజీ చికెన్ రేట్ రూ.350 పలుకుతోంది. పట్టణాలు, గ్రామాల్లో అయితే దీనికి అదనంగా రూ.20 కలిపి రూ.370కి విక్రయిస్తున్నారు. అటు తెలంగాణలోని హైదరాబాద్‌లో కేజీ కోడి మాంసం రూ.300-320 పలుకుతోంది. మిగతా ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మరి మీ ఏరియాలో కేజీ చికెన్ ధర ఎంత?

News January 13, 2026

కోడి పందేలపై డ్రోన్ల వేట.. జూదగాళ్లకు SP వార్నింగ్

image

జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడలు పూర్తిగా నిషేధమని ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. పందాలు నిర్వహించినా లేదా ప్రోత్సహించినా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బరుల వద్ద నిఘా కోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.