News April 21, 2024
రేపే టెన్త్ ఫలితాలు.. WAY2NEWSలో సులభంగా తెలుసుకోండి

AP: టెన్త్ ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో పాటు WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు. మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగగా, రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు వెల్లడవుతున్నాయి. దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Similar News
News January 22, 2026
HYD: మేడారం వెళ్తున్నారా..? 7658912300కి ‘HI’ పెట్టండి

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ చేస్తే జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందొచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానపు ఘట్టాలు సహా ఇతర వివరాలను నేరుగా వాట్సాప్‌లోనే చూడ
News January 22, 2026
త్వరలో 600 మంది వైద్య సిబ్బంది నియామకం: వివేక్

TG: ఈఎస్ఐలో త్వరలో 600 మంది వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ESIలో పేషంట్లకు ట్రీట్‌మెంట్‌లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నాచారం ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఆర్సీపురంలో ఐసీయూ ఏర్పాటుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
News January 22, 2026
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


