News December 18, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉపసర్పంచ్ ఎన్నికలకు ఆదేశాలు

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికల అనంతరం పెద్దపల్లి జిల్లాలో ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 18న కమాన్‌పూర్, ముత్తారం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీపీలు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని స్పష్టం చేశారు.
Similar News
News January 13, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పండగ వేళ నాన్‌వెజ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏపీలోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లో కేజీ చికెన్ రేట్ రూ.350 పలుకుతోంది. పట్టణాలు, గ్రామాల్లో అయితే దీనికి అదనంగా రూ.20 కలిపి రూ.370కి విక్రయిస్తున్నారు. అటు తెలంగాణలోని హైదరాబాద్‌లో కేజీ కోడి మాంసం రూ.300-320 పలుకుతోంది. మిగతా ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మరి మీ ఏరియాలో కేజీ చికెన్ ధర ఎంత?
News January 13, 2026
కోడి పందేలపై డ్రోన్ల వేట.. జూదగాళ్లకు SP వార్నింగ్

జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడలు పూర్తిగా నిషేధమని ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. పందాలు నిర్వహించినా లేదా ప్రోత్సహించినా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బరుల వద్ద నిఘా కోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News January 13, 2026
వంటింటి చిట్కాలు

* వెండి వస్తువులు నల్లగా మారిపోతే వాటికి టమాటా కెచప్ రాసి, 15 నిమిషాల తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే తెల్లగా మెరుస్తాయి.
* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వేస్తే వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.


