News April 21, 2024
విశాఖ: ‘నేడు ఉక్కు శిబిరం వద్ద భారీ స్థాయిలో నిరసన’

కూర్మన్నపాలెం ఉక్కు శిబిరం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ కో కన్వీనర్ అయోధ్య రామ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశాన్ని అన్ని పార్టీలు ప్రధాన అజెండాగా చేర్చాలని కోరుతూ.. ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఉదయం 9:30 గంటలకు నిరసన ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News October 10, 2025
విశాఖ: అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 20 దరఖాస్తులు

IDCS విశాఖ అర్బన్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో 2 కార్యకర్తల పోస్టులు, 21 ఆయాల పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు నేటితో గడువు ముగిసింది. 2 కార్యకర్తల పోస్టులకు 20 దరఖాస్తులు వచ్చినట్లు అర్బన్ సీడీపీవో నీలిమ శుక్రవారం తెలిపారు. 21 ఆయా పోస్టులకు 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు సమాచారం అందిస్తామన్నారు.
News October 10, 2025
విశాఖ: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

విశాఖ వేదికగా VCA – ADCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12న (ఆదివారం) ఇండియా V/S ఆస్ట్రేలియా ఉమెన్స్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ జరిగిన మ్యాచులో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ చేతిలో ఇండియా ఉమెన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావటంతో అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
News October 10, 2025
కంచరపాలెం చోరీ కేసులో వీడిన చిక్కుముడి?

కంచరపాలెం ఇందిరానగర్-5 <<17927881>>దొంగతనం కేసు<<>>లో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయినట్లు సమాచారం. బాధిత కుటుంబంలో ఓ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనే పథకం ప్రకారం ఈ దోపిడీకి ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నెల 5 అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యమ్మ(73)నోట్లో గుడ్డలు కుక్కి 12 తులాల బంగారు, కారు, కొంత నగదుతో దుండగలు పరారయ్యారు. కంచరపాలెం క్రైంపోలీసులు కేసును తమైదన శైలిలో విచారిస్తున్నారు.