News December 18, 2025
రైతుల ఖాతాల్లోకి రూ.53 కోట్లు: సివిల్ సప్లైస్ మేనేజర్

ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 3,520 మంది రైతుల వద్ద నుంచి 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తులసి తెలిపారు. తెనాలిలో వ్యాగన్ల ద్వారా జరుగుతున్న ధాన్యం ఎగుమతులను బుధవారం సాయంత్రం పరిశీలించారు. రూ.53 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. నేడు, రేపు 2,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వ్యాగన్లలో కాకినాడ జిల్లా పెద్దాపురం మిల్లుకు తరలిస్తున్నట్టు తెలిపారు.
Similar News
News January 12, 2026
PGRS ఫిర్యాదులు పునరావృతం కాకూడదు: SP

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.
News January 12, 2026
GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.
News January 12, 2026
తెనాలి సబ్ కలెక్టర్‌కు పదోన్నతి.. బదిలీ..!

తెనాలి సబ్ కలెక్టర్ V.సంజనా సింహ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజన సింహ పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది తెనాలి నుంచి బదిలీ అయ్యారు. ఐతే తెనాలి సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.


