News December 18, 2025

రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్‌గా డాక్టర్ యామిని ప్రియ

image

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 24, 2026

తూ.గో: జిల్లాలో 201 కేసుల్లో 12,570 కేజీల గంజాయి స్వాధీనం

image

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేయాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 201 కేసులలో 12,570 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో మాదకద్రవ్య దుర్వినియోగ హాట్‌స్పాట్‌లు గుర్తించి నిఘా ఏర్పాటు చేశామన్నారు. సున్నిత ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఎస్పీ సూచించారు.

News January 24, 2026

గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే: ఇన్ఛార్జి కలెక్టర్

image

2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 515 రోజులే ఉన్నందున, చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం అమరావతి నుంచి సమీక్ష నిర్వహించారన్నారు. వీటిపై ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

News January 23, 2026

తూ.గో: ఉద్యోగాలకు 57 మంది ఎంపిక

image

కర్ణాటక రాష్ట్రం హోసూరు ప్రాంతంలోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ పోస్టులకు తూ.గో జిల్లాకు చెందిన 57మంది ఎంపికయ్యారని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.