News December 18, 2025
SVU: LLM ఫలితాలు విడుదల

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈఏడాది ఆగస్టులో పీజీ(PG) L.LM నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోగలరు.
Similar News
News January 15, 2026
భారత్ మద్దతు కోరుతున్న ఇరాన్!

ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. మరోవైపు యుద్ధం చేస్తామంటూ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్ సాయాన్ని ఇరాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా తెలిపారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ ఆ దేశంలోని పరిస్థితులపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
News January 15, 2026
పసిడి మనసుల పండుగ ‘బొమ్మల కొలువు’

సంక్రాంతికి తెలుగు ఇళ్లలో ఆచరించే ముచ్చటైన సంప్రదాయం బొమ్మల కొలువు. ఇంట్లోని దేవతా మూర్తులు, జానపద కళారూపాలు, వృత్తులను ప్రతిబింబించే మట్టి బొమ్మలను మెట్ల ఆకారంలో అమర్చుతారు. ఇది అలంకరణే కాదు. భావితరాలకు మన సంస్కృతి, పురాణ గాథలను పరిచయం చేసే ముఖ్య వేదిక. ఆడపిల్లలు, మహిళలు పేరంటాలకు పిలుచుకుని తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సృజనాత్మకతను, ఆత్మీయతను పెంచే ఒక అందమైన వేడుక.
News January 15, 2026
సంక్రాంతి స్పెషల్ బస్సులు.. రూ.100 కోట్ల ఆదాయం

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా TGSRTC ఈ నెల 9 నుంచి 14 వరకు 6 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపింది. ఈ ఆరు రోజుల్లో సుమారు 2.40 కోట్ల మంది ప్రయాణించడం ద్వారా రూ.100 కోట్ల వరకూ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసారి APSRTC బస్సులు హైదరాబాద్‌కు రాకపోవడం కూడా కలిసొచ్చింది. పండుగ తర్వాత జనవరి 18, 19 తేదీల్లోనూ స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.


