News April 21, 2024
దుబాయ్‌లో గుండెపోటుతో సోన్ వాసి మృతి

సోన్ మండలం గంజాల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పాలెపు గంగయ్య (43) అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. గల్ఫ్‌లో పనిచేస్తుండగా ఈ నెల 12న గుండెపోటుతో మృతి చెందాడు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Similar News
News November 15, 2025
ఆధార్ సేవల్లో వేగం, ఖచ్చితత్వం పెంచాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఆధార్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన ఆధార్–మీసేవ ప్రత్యేక సమీకృత శిబిరాల్లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు మంజూరైన ఆధార్ కార్డులు, ఆదాయ, నివాసతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని అన్నారు.
News November 14, 2025
పోటీ పరీక్షల్లో ప్రాక్టీస్ అత్యవసరం: కలెక్టర్ రాజర్షి షా

ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించి ర్యాంకులు సాధించాలంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, ప్రాక్టీస్ అత్యవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ హాల్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కోసం అభ్యర్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేష్ పాల్గొన్నారు.
News November 14, 2025
పోషకాహారం లక్ష్యంగా ముందుకు: కలెక్టర్ రాజర్షి షా

విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన న్యూట్రీ గార్డెన్, ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్, మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.


