News April 21, 2024
చేతిలో పేలిన సెల్‌ఫోన్.. బాలికకు తీవ్ర గాయాలు

AP: సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పేలడంతో 11 ఏళ్ల బాలిక వీరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పల్నాడు(D) ఎమ్మాజీగూడెంలో జరిగింది. ప్రమాదంలో బాలిక కుడి చేతి 2 వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలోనూ గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
NOTE: ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం, వీడియోలు చూడటం ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు.
Similar News
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ&రేటింగ్

పెళ్లైన వ్యక్తి ఓ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని భార్యకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడనేది స్టోరీ. రవితేజ నటన, సునీల్, వెన్నెల కిశోర్, సత్య కామెడీ, మ్యూజిక్ ప్లస్. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం దక్కింది. ఆషికా రంగనాథ్ గ్లామర్ యువతను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అన్పిస్తాయి. స్క్రీన్ ప్లే, కథను నడిపించడంలో డైరెక్టర్ తడబడ్డారు. మూవీ క్లైమాక్స్ నిరాశకు గురి చేస్తుంది.
రేటింగ్: 2.25/5
News January 13, 2026
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే.. గుండెకు ముప్పే: వైద్యులు

రోజువారీ అల్పాహారం మానేస్తే గుండెపోటు ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతేడాది 23లక్షల మందిపై జరిపిన పరిశోధనలో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే గుండె జబ్బుల ముప్పు 17%, స్ట్రోక్ ప్రమాదం 15 శాతం పెరుగుతుందని తేలింది. ‘దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం టిఫిన్ మానేయడం కంటే, రాత్రి త్వరగా భోజనం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.
News January 13, 2026
గాదె ఇన్నయ్య.. మరోసారి NIA రైడ్స్

TG: జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌లో గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’ ఆశ్రమంలో NIA మరోసారి రైడ్స్ చేస్తోంది. ఆయన స్వగ్రామం సాగరంలోని ఇంట్లోనూ సోదాలు చేపట్టింది. మావోయిస్టు సానుభూతిపరుడనే ఆరోపణలతో గతంలో ఇన్నయ్యను NIA అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపింది.


