News December 18, 2025

HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

image

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.

Similar News

News January 9, 2026

డీజీపీ శివధర్‌రెడ్డి నియామకంపై ఇవాళ హైకోర్టు తీర్పు

image

డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వం జాబితాను ఆలస్యంగా పంపడంతో యూపీఎస్సీ తిరిగి పంపిందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది.

News January 9, 2026

FLASH: HYDలో బస్సు బోల్తా

image

సినిమా షూటింగ్‌కు వెళ్తున్న బస్సు పెద్దఅంబర్‌పేట్‌లో బోల్తా కొట్టింది. హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి మణికొండకు వస్తున్న బస్సు పెద్ద అంబర్‌పేట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. డ్రైవర్ విజయ భాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎలక్ట్రిషన్, డ్రైవర్ విజయ్‌లకు గాయాలయ్యాని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 9, 2026

HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

image

సిటీ నుంచి సంక్రాంతికి సొంతరు వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో టికెట్లకు స్పెషల్ రేట్లు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకే ప్రత్యేక దిన్నాల్లో RTC స్పెషల్ రేట్స్ అమలు చేస్తుంది. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.