News December 18, 2025
NZB: తుది దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం

నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తుది దశ పోరులో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో విడతలో మొత్తం 165 పంచాయతీ సర్పంచ్లకు 19 చోట్ల ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 95 చోట్ల, బీఆర్ఎస్ 36, బీజేపీ 16, స్వతంత్రులు 18 చోట్ల సర్పంచ్లుగా గెలుపొందారు.
Similar News
News February 2, 2026
నిజామాబాద్: సమయస్ఫూర్తి చూపిన సిబ్బందిని అభినందించిన సీపీ

సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా అపస్మారక స్థితికి వెళ్లిన ప్రయాణికుడికి సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సిబ్బంది దస్తయ్య, అదే విధంగా అంబులెన్స్‌కు మార్గం క్లియర్ చేసిన వినోద్‌లను జిల్లా పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో అభినందించారు. వారు చూపిన సమయస్ఫూర్తిని కొనియాడారు.
News February 2, 2026
NZB: పార్టీలు మారుతారని ప్రకటించడం లేదా?

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పోరేటర్లుగా పోటీ చేసే తమ అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నేటి వరకు ప్రకటించలేదు. ఇరు పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహులు పార్టీల పేరు చెప్పి నామినేషన్లు వేసినప్పటికీ వారికి బీఫారాలు ఇంకా అందజేయ లేదు. ముందుగా ప్రకటిస్తే ఆశావహులు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయని భావించి రేపు నామినేషన్ల విత్ డ్రా అయ్యాక బీఫారం ఇచ్చేందుకు సిద్ధం చేశాయి.
News February 2, 2026
NZB: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున జాగృతి అభ్యర్థులు

జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము మంచి అభ్యర్థులను పెట్టామని వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయాలని, మనకు పనిచేసేటోళ్లను గెలిపించాలన్నారు. గుడ్డిగా లేబుల్ చూసి ఓటు వేస్తే కచ్చితంగా మనం నష్టపోతామని ఆమె అన్నారు.


