News December 18, 2025

క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

image

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో వేయాలి.

Similar News

News January 14, 2026

రూ.15,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.

News January 14, 2026

దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

image

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

News January 14, 2026

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతగల వారి నుంచి జనవరి 15 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in