News December 18, 2025
ఏలూరు: కన్న కొడుకే గెంటేశాడు..!

కన్నకొడుకే తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన ముదినేపల్లి (M) కొత్తపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలు కోటేశ్వరమ్మ వివరాల మేరకు.. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మించుకోగా చిన్న కొడుకు దానికి లాక్కున్నాడు. కొంత కాలం ఇంట్లో ఉంటామని చెప్పి కుమారుడు, కోడలు ఇంటిని స్వాధీనం చేసుకుని తనను బయటకు పంపేశారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని బుధవారం ఏలూరులో RDO అచ్యుత అంబరీష్‌ను కోరింది.
Similar News
News January 12, 2026
20 రోజుల్లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP: ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. మరో 20 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని CS విజయానంద్ అత్యవసర మెమో జారీ చేశారు. ఈ నెల 21వ తేదీలోపు HODలు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. 29 నాటికి డీపీసీ పూర్తిచేసి, 31లోపు పదోన్నతుల జీవోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి ఏడాది ఇదే షెడ్యూల్ పాటించాలని స్పష్టం చేశారు.
News January 12, 2026
నల్గొండ: నిరుద్యోగులకు అలర్ట్.. ఉచిత శిక్షణకు దరఖాస్తులు!

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సర్కిల్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు ఉచిత శిక్షణకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శశికళ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.నరసింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్టడీ సర్కిల్లో ప్రవేశాలకు పోటీపరీక్షల్లో అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
News January 12, 2026
సంక్రాంతికి విశాఖ-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖ, విజయవాడ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు DRM లలిత్ బోహ్ర ఆదివారం తెలిపారు. విశాఖ – విజయవాడ జన సాధారణ రైలు (08567/68) జనవరి 12,13,14, 16,17,18 తేదీలలో నడవనుంచి. విశాఖలో ఉదయం 10.08 గంటలకు బయలుదేరి విజయవాడ సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది.


