News December 18, 2025
RR: 3 ఫేజుల్లో.. ముగ్గురు లక్కీ సర్పంచ్‌లు

రంగారెడ్డి జిల్లాలో 3విడతల్లో లక్కీగా సర్పంచ్ పీఠం ముగ్గురిని వరించింది. 1st ఫేజ్‌లో కొందర్గు చిన్నఎల్కిచర్లలో ఇద్దరికి సమాన ఓట్లురాగా టాస్‌తో రాజు గెలిచారు. 2nd ఫేజ్‌లో చేవెళ్ల గుండాలలో నరాలు తెగే ఉత్కంఠలో ఒక్క ఓటుతో బుచ్చిరెడ్డి గెలిచారు. 3rd ఫేజ్‌లో యాచారం తులేఖుర్దులో ఇద్దరికి సమాన ఓట్లు రాగా ఉద్రిక్తతకు దారితీస్తుందని గమనించిన పోలీసులు పరిస్థితి అదుపుచేయగా రికౌంటింగ్‌లో రమేశ్ గెలుపొందారు.
Similar News
News February 3, 2026
NLG: B.P.Ed &D.P.Ed విద్యార్థులకు గమనిక

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో B.P.Ed & D.P.Ed సెమిస్టర్-1 రెగ్యులర్ సంబంధిచి పరీక్షలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కారణంగా ఆరోజు జరగవలసిన పరీక్షను 13వ తేదీకి రీ-షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News February 3, 2026
ఈనెల 5న భీమవరానికి మాజీ సీఎం జగన్

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 5న భీమవరం రానున్నారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు కుమారుడు చిట్టిరాజు (ఐపీఎస్) వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కాళ్ల మండలం పెదమిరం వద్దనున్న రాధాకృష్ణ కల్యాణ మండపానికి చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ కార్యాలయ వర్గాలు పర్యటన వివరాలను వెల్లడించాయి.
News February 3, 2026
ఆసీస్‌కు మరో షాక్.. ప్రారంభ మ్యాచ్‌లకు హేజిల్‌వుడ్ దూరం

T20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే టోర్నీకి కమిన్స్ దూరమవ్వగా, తాజాగా ఆ జట్టు కీలక బౌలర్ హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచులకు దూరంకానున్నారు. కాలి మడమ నొప్పి గాయం నుంచి కోలుకుంటున్న హేజిల్‌వుడ్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీంతో అతడి స్థానంలో రిజర్వ్ పేసర్‌గా సీన్ అబాట్‌కు అవకాశం కల్పించారు.


