News December 18, 2025
ప్రశాంత వాతావరణంలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు: జిల్లా ఎస్పీ

జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారి నుంచి రూ. 6.49 లక్షల విలువైన మద్యం, గంజాయి, నగదు, చీరలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 800 మంది పోలీసులు, 200 మంది ఇతర సిబ్బంది విధులు నిర్వహించారని వెల్లడించారు. రౌడీషీటర్లను, అనుమానితులను బైండోవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News January 12, 2026
ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

ఏపీలో 14మంది IASలను బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా నుపుర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా JCగా కల్పనకుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్, తిరుపతి JC, తుడా వైస్ ఛైర్మన్‌గా గోవిందరావు, కడప JCగా నిధి మీన, అనంతపురం JCగా విష్ణుచరణ్, అనకాపల్లి JCగా సూర్యతేజ, చిత్తూరు JCగా ఆదర్శ్ రాజేంద్రన్.
News January 12, 2026
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆదర్శ రాజేంద్రన్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా నూతన జేసీగా 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శివ నారాయణ శర్మను నియమించింది. నూతన జేసీ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 12, 2026
అనంతపురం జిల్లా JC బదిలీ

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


