News December 18, 2025

గద్వాల: రూ.లక్షలు ఖర్చు పెట్టి.. నిరాశే మిగిలి!

image

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన 3 విడతల సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ ఇటీవల సాధారణంగా మారింది. అదేవిధంగా ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఉండడంతో ఆ పదవికి కొందరు డబ్బులు ఖర్చుపెట్టినట్లు వినికిడి. పలు గ్రామాల్లో కొందరు అభ్యర్థులు రూ.లక్షలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవలేక అప్పులు, నిరాశలో కూరుకుపోయారని చర్చించుకుంటున్నారు.

Similar News

News January 14, 2026

మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

image

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్‌ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్‌ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.

News January 14, 2026

విశాఖ నుంచి వందే భారత్ రైళ్లు అదనంగా నడపాలని లేఖ

image

విశాఖపట్నం విమానాశ్రయం జూన్–జులై నెలల్లో భోగాపురానికి మారనున్న నేపథ్యంలో నగరం నుంచి అదనంగా వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుందని లేఖలో వివరించారు.

News January 14, 2026

చిట్వేల్‌లో సంక్రాంతి పండుగ.. కుటుంబం అంతా ఒకే చోట భోజనం..!

image

సంక్రాంతి పండుగతో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని చిట్వేల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. గత 50 ఏళ్లుగా భోగి రోజున నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు కలిసి సంయుక్త అరిటాకు భోజనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది 46 మంది కుటుంబ సభ్యులు పాల్గొనగా, హైదరాబాదు, బెంగళూరు, విదేశాల్లో ఉన్నవారు కూడా భోగి రోజున కలుస్తారన్నారు. దీంతో కుటుంబాల్లో ప్రేమానురాగాలు మరింత బలపడతాయన్నారు.