News December 18, 2025

NZB: ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థిని మృతి

image

మెండోరా(M) పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ముప్కాల్‌కు చెందిన సాయి లిఖిత HYD చికిత్స పొందుతూ మరణించింది. ఈ నెల 5న బాలిక వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని, ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలఎదుట మృతదేహంతో నిరసనకు యత్నించారు.

Similar News

News January 13, 2026

బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

NZB జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో శుభాలు సమకూరాలని, అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.