News December 18, 2025

సిరిసిల్ల గడ్డపై చెల్లాచెదురైన ‘గులాబీ’

image

KTR, BRS కంచుకోటగా పేరొందిన సిరిసిల్ల నియోజకవర్గంలో ఈసారి రాజకీయ చిత్రం తలకిందులైంది. నియోజకవర్గంలోని 5 మండల కేంద్రాల్లో కేవలం ఎల్లారెడ్డిపేటలో మాత్రమే BRS బలపరిచిన అభ్యర్థి ఎలగందుల నర్సింలు విజయం సాధించారు. తంగళ్లపల్లిలో కాంగ్రెస్‌ (మోర లక్ష్మీరాజం), ముస్తాబాద్‌లో BJP (మట్ట వెంకటేశ్వర్ రెడ్డి), వీర్నపల్లిలో CPM (M.జ్యోత్స్న), గంభీరావుపేటలో స్వతంత్ర అభ్యర్థి మల్లుగారి పద్మ గెలిచారు.

Similar News

News January 13, 2026

వారసత్వ వ్యవసాయ భూములకు స్థిర స్టాంప్ డ్యూటీ: విశాఖ కలెక్టర్

image

పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సౌలభ్యం కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వీలునామా లేకుండా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములపై పార్టిషన్ డీడ్ నమోదు సందర్భంలో మొత్తం మార్కెట్ విలువ రూ.10 లక్షలు మించకపోతే రూ.100 స్థిర స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తామన్నారు. రూ.10 లక్షలు మించితే రూ.1000 స్థిర స్టాంప్ డ్యూటీ.

News January 13, 2026

BHPL: ఆస్తి కోసం తమ్ముడిపై అన్న కుటుంబం దాడి

image

గణపురం మండలం సీతారాంపురంలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్న, అతడి భార్య, కుమారులు కలిసి తమ్ముడిపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన మహమ్మద్ సర్వర్ అహ్మద్‌పై తీవ్రంగా దాడి చేయగా తలకు గాయాలయ్యాయి. బాధితుడు భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై గణపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 13, 2026

సంక్రాంతి: ఈ పరిహారాలు పాటిస్తే బాధలు దూరం

image

పుష్య మాసం, మకర రాశి శని దేవుడికి ప్రీతిపాత్రమైనవి. సంక్రాంతి రోజున శని అనుగ్రహం కోసం నువ్వుల నలుగుతో స్నానం చేయాలి. దారిద్ర్యం పోవాలంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయాలి. పితృదేవతలకు తర్పణాలు వదిలితే కుటుంబానికి సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ రోజు పెరుగు దానం చేయడం వల్ల సంతాన క్షేమం, సంపద, ఆయుష్షు లభిస్తాయి. ఈ చిన్న పరిహారాలు పాటిస్తే సకల బాధలు తొలగి శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.