News December 18, 2025

టైగర్ జోన్‌లో ఆవాసాల కొరత.. జనావాసాల్లోకి పులులు

image

టైగర్ జోన్ పరిధిని దాటి పులులు పెద్దపల్లి జిల్లాలో గ్రామాల శివార్లలోకి రావడం స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. చెట్ల నరికివేత, గనులు, రోడ్ల నిర్మాణంతో పులుల సహజ ఆవాసాలు తగ్గిపోవడం, అడవుల్లో ఆహారం, నీటి కొరత పెరగడం జనావాసాల్లో పులుల సంచారానికి ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. అక్రమ వేట, స్మగ్లింగ్ ముప్పూ పెరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది.

Similar News

News January 28, 2026

మేడారం జాతర ‘LIVE’.. ఫోన్లోనే తల్లుల దర్శనం

image

మేడారంలో జరిగే ప్రధాన ఘట్టాలను Way2News పాఠకులకు లైవ్ అప్‌డేట్స్ అందించనుంది. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల పైకి చేరే అద్భుత ఘట్టాలను మీ చేతిలో ఉన్న ఫోన్లోనే వీక్షించవచ్చు. 24/7 లైవ్ కవరేజ్, ట్రాఫిక్ అప్‌డేట్స్‌, బెస్ట్ రూట్ మ్యాప్స్, గద్దెలు-బస్టాండ్ల వద్ద పరిస్థితి తెలుసుకోవచ్చు.

జగిత్యాల: ప్రాథమిక విద్యాభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో FLN (Foundational Literacy and Numeracy)పై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా విద్యార్థుల చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. పాఠశాల వారీగా డేటా విశ్లేషించి రాబోయే 40 రోజుల్లో విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలు సాధించేలా ఉపాధ్యాయులకు లక్ష్యాలు నిర్దేశించాలని ఆదేశించారు.