News December 18, 2025
అత్యధికం ఎల్లారెడ్డి.. అత్యల్పం రామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,97,512 ఓటర్లకు గాను 4,97,861 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా రెండో విడతలో 86.08% పోలింగ్ జరగగా, అత్యల్పంగా మొదటి విడతలో 79.40% పోలైంది. అత్యధికంగా ఎల్లారెడ్డి మండలంలో ఓట్లు పోలవ్వగా, అత్యల్పంగా రామారెడ్డిలో పోలయ్యాయి.
Similar News
News January 18, 2026
ADB: వేడెక్కనున్న బల్దియా పోరు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీల్లో వార్డులు, ఛైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు శనివారం ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రొటేషన్ పద్ధతిలో స్థానాలను కేటాయించారు. ముఖ్యంగా 50 శాతం స్థానాలు మహిళలకు దక్కడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రిజర్వేషన్లపై ఎట్టకేలకు స్పష్టత రావడంతో ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 18, 2026
నిర్మల్: రేపటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ చట్టం, అధికారాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బాసర IIIT, నిర్మల్ DMSVK కేంద్రాల్లో జనవరి 19 నుంచి FEB 20 వరకు నాలుగు విడతల్లో ఈ శిక్షణ జరుగుతుంది. కేటాయించిన తేదీల్లో మండలాల వారీగా సర్పంచ్‌లు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి, పాలనపై ఈ సందర్భంగా అవగాహన కల్పించనున్నారు.
News January 18, 2026
రూ.300కోట్ల దిశగా MSVPG కలెక్షన్స్

చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.261కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేశ్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.


