News December 18, 2025

VJA: చిన్నారుల విక్రయ ముఠా అరెస్టుతో విస్తుపోయే నిజాలు..!

image

విజయవాడలో <<18602510>>చిన్నారుల విక్రయ ముఠాను<<>> పోలీసులు అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ నుంచి నెలల వయసున్న శిశువులను తీసుకువచ్చి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురిని ఐసీడీఎస్‌ కేంద్రానికి తరలించారు. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు DCP సరిత తెలిపారు.

Similar News

News January 3, 2026

కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.

News January 3, 2026

HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

image

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.

News January 3, 2026

చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

image

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.