News December 18, 2025

వనపర్తి: సకాలంలో డబ్బులు జమ చేయాలి: కలెక్టర్

image

కష్టపడి ధాన్యం పండించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా సహకార సంఘం, సివిల్ సప్లై అధికారులతో వరి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నాము, ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాల్సి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News January 14, 2026

జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

image

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.

News January 14, 2026

ఆర్థిక సంఘం నిధులు వచ్చేస్తున్నాయ్!

image

TG: సుమారు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి నిలిచిపోయిన గ్రామపంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పడగా జీపీలకు త్వరలో 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. రాష్ట్రానికి రూ.2,500Cr పెండింగ్‌ ఉండగా ఈ నెలాఖరు నాటికి రూ.1000Cr, వచ్చేనెల రూ.1500Cr కేంద్రం రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ప్రతి జీపీకి ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్‌తో నిధులను వినియోగిస్తారు.

News January 14, 2026

ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>రాయ్‌పుర్‌<<>>లోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టులను బట్టి టెన్త్+NTC/నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 -32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ddpdoo.gov.in/