News December 18, 2025
అనకాపల్లి: 19న రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు

రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు ఈనెల 19న విజయవాడ కృష్ణా నది ఒడ్డున నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ తెలిపారు. ఖేలో ఇండియా-2వ విడతలో పురుషులు, మహిళల ఓపెన్ క్యాటగిరి విభాగంలో కబాడీ, వాలీబాల్, సెపక్ తక్ర పోటీలు జరుగుతాయని అన్నారు. విజేతలు జనవరి 5 నుంచి 10 వరకు దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
Similar News
News January 13, 2026
HYD: నేడు ఆకాశంలో అద్భుతాలు..!

నేడు HYD దద్దరిల్లనుంది. ఆకాశంలో రోజంతా అద్భుతాలు చూడొచ్చు.
☛ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 3 డేస్ కైట్& స్వీట్ ఫెస్టివల్
☛ 3డేస్ పరేడ్ గ్రౌండ్లో సా.5 నుంచి రాత్రి వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్
☛ గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్
వీటికోసం రాష్ట్ర పర్యాటకశాఖ సర్వం సిద్ధం చేసినట్లుగా వెల్లడించింది.
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్

రవితేజ-కిశోర్ తిరుమల కాంబోలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఇవాళ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను SM వేదికగా పంచుకుంటున్నారు. ‘స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌లా అనిపించినా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మెప్పిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ&రేటింగ్.