News April 21, 2024

అనంత: ట్రాక్టరు నుంచి కిందపడి యువకుడి మృతి

image

ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిలోని గూళ్యపాళ్యం శివారులో శనివారం ట్రాక్టరు నుంచి కిందపడి కొనకొండ్లకు చెందిన విశ్వాసరావు(19) మృతి చెందాడు. అతడు శుక్రవారం తరిమెల గ్రామంలో మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. శనివారం గ్రామానికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ నుంచి జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై నరేశ్ తెలిపారు.

Similar News

News March 24, 2026

ఆర్డీటీ పోరాటం సఫలం: మాజీ ఎంపీ తలారి రంగయ్య

image

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ కోసం చేసిన పోరాటం ఫలించిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గుంజి తాండ నుంచి చేపట్టిన పాదయాత్ర, పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా సంస్థకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేలా శుభవార్త రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్డీటీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News March 24, 2026

ATP: ఈ నెల 24, 25 తేదీలలో జేఎన్టీయూలో టెక్నికల్ ఫెస్ట్‌లు

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మార్చి 24, 25 తేదీలలో టెక్నికల్ ఫెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి పేపర్ ప్రజెంటేషన్, టెక్నికల్ క్విజ్, ప్రాజెక్ట్ ఎక్స్పో వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య హాజరవుతున్నట్లు తెలిపారు.

News March 24, 2026

గుత్తి కోటకు నడక మెట్లు ఏర్పాటుకు సీఎం అనుమతి: కలెక్టర్

image

జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గుత్తి కోటకు సంబంధించి నడక మెట్లు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వడం జరిగిందని, మెట్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ అంశాన్ని అజెండాలో పొందుపరచాలని పేర్కొన్నారు.