News December 18, 2025

కొండగట్టు అంజన్న సన్నిధిలో 100 గదుల నిర్మాణానికి TTD ఓకే..?

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం 100 వసతి గదుల నిర్మాణానికి TTD బోర్డు తీర్మానం చేసినట్లు సమాచారం. గతంలో కొండగట్టు దర్శనానికి వచ్చిన సందర్భంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న సన్నిధిలో 100 గదుల నిర్మాణం చేపడతామని వాగ్దానం చేశారు. ఇదిలా ఉండగా తాజా అప్డేట్ గురించి టీటీడీ పాలకమండలి నుంచి తమకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.

Similar News

News January 10, 2026

అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్ చల్

image

యూపీలోని అయోధ్య రామమందిరంలో భద్రతా వైఫల్యం తలెత్తింది. కశ్మీర్‌కు చెందిన అబ్ అహద్ షేక్ D1 గేటు నుంచి ఆలయంలోకి ప్రవేశించి హల్ చల్ చేశాడు. ఆలయ ప్రాంగణంలో నమాజ్ చదివేందుకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నినాదాలు చేశాడు. దీనిపై ఆలయ ట్రస్టు స్పందించాల్సి ఉంది.

News January 10, 2026

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు

image

ధరూర్ మండలం పెద్దచింతరేవుల గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహోత్సవాలు ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణధికారి సి.కవిత తెలిపారు. ఈనెల 22న రాత్రి తెప్పోత్సవం, ప్రభోత్సవం ఉంటాయన్నారు. ఈనెల 23 శుక్రవారం రాత్రి 10 గంటలకు రథోత్సవం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని బ్రహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

News January 10, 2026

భద్రాద్రి: ‘రెండో శనివారం, ప్రభుత్వాసుపత్రికి సెలవు’

image

అశ్వారావుపేట(M) వినాయకపురం ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మోర్ల సతీష్, సూరిబాబు 2 రోజులుగా విషజ్వరంతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు. శనివారం కూడా వారు వైద్యం కోసం ఆసుపత్రికి రాగా, మధ్యాహ్నం వరకు వేచి చూడాలని సిబ్బంది చెప్పారు. తీరా మధ్యాహ్నం అయ్యాక.. ‘ఈరోజు రెండో శనివారం, ఆసుపత్రికి సెలవు’ అని చెబుతూ తాళం వేసి వెళ్లిపోయారని రోగులు వాపోయారు.