News April 21, 2024
నల్గొండ: మూడు రోజుల్లో పెళ్లి.. యువతి మిస్సింగ్

తిప్పర్తి మండలంలో శనివారం యువతి అదృశ్యమైంది. సర్వారం గ్రామానికి చెందిన సదరు యువతికి వివాహం నిశ్చయమైంది. ఈనెల 24న వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి ఎస్ఐ రాజు తెలిపారు.
Similar News
News March 19, 2026
నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ 99 రోజుల లక్ష్యంలో భాగంగా, జూన్ 12 నాటికి 6,409 గృహాలను పూర్తి చేయాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అత్యధిక ఇళ్లను నిర్మించిన జిల్లాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుని NLG రికార్డు సృష్టించింది. ఇప్పటికే 1809 గృహాలు గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి.
News March 19, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.