News December 18, 2025
కలెక్టర్‌ను వెంటబెట్టుకుని సీఎంను కలిసిన పవన్ కళ్యాణ్

కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పవన్ ఆప్యాయంగా చేతితో పట్టుకుని సీఎం వద్దకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Similar News
News January 12, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: DAO

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు అన్ని మండలాల్లో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 32,793 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News January 12, 2026
కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌కు సన్నాహాలు..!

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 4 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంకలో ఉన్న ఇసుక రీచ్‌లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఘంటసాల మండలం పాపవినాశనంలో మరో రీచ్‌ను ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 12, 2026
‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


