News December 18, 2025

గండిపేట నీరు సురక్షితం.. వదంతులు నమ్మొద్దు: జలమండలి క్లారిటీ!

image

గండిపేటలో మురుగునీరు కలిసినట్లు వస్తున్న వార్తలను జలమండలి MD అశోక్ రెడ్డి ఖండించారు. వ్యర్థాలను పారబోసేందుకు యత్నించిన ప్రైవేట్ ట్యాంకర్‌ను ముందే గుర్తించి అడ్డుకున్నారని, రిజర్వాయర్ కలుషితం కాలేదని స్పష్టం చేశారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ​ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, IS ప్రమాణాలతో ‘మూడంచెల క్లోరినేషన్’ పద్ధతిలో నీటిని శుద్ధి చేస్తున్నట్లు వివరించారు.

Similar News

News January 9, 2026

ఆసిఫాబాద్‌‌లో మున్సిపల్ అభ్యర్థుల వేట

image

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహుల బలాబలాలపై రహస్య సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీసీ, జనరల్ రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని కులాల వారీగా ఒక్కో వార్డు నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను సేకరిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే గెలుపు గుర్రాలుగా భావిస్తూ అడుగులు వేస్తున్నాయి.

News January 9, 2026

సంక్రాంతికి ఫ్రీ టోల్‌ లేనట్లే!

image

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్‌ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్‌ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.

News January 9, 2026

త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

image

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.