News December 18, 2025
కొత్త మెడికల్ కాలేజీల్లో 96కి పెరిగిన పీజీ సీట్లు

AP: కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా 36 PG సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ కాలేజీల్లో అదనపు సీట్ల కోసం నియామకాలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించగా ప్రిన్సిపాళ్లు MNCకి దరఖాస్తు చేశారు. మంత్రి సత్యకుమార్ సంప్రదింపులతో తాజా సీట్లు శాంక్షన్ అయ్యాయి. ఏలూరుకు 12, రాజమండ్రికి 4, నంద్యాలకు 4, విజయనగరానికి 8, మచిలీపట్నానికి 8 కేటాయించారు. గతంలో 60 సీట్లు రాగా ఇప్పుడవి 96కు చేరాయి.
Similar News
News January 12, 2026
చర్చలకైనా, యుద్ధానికైనా మేం రెడీ: ఇరాన్

దాడి చేస్తామని ట్రంప్ <<18832950>>హెచ్చరిస్తున్న<<>> నేపథ్యంలో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. హింసకు మొస్సాద్ కారణమని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ అనుకూల ర్యాలీల కోసం వేలమందిని రంగంలోకి దించినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. టెహ్రాన్‌తోపాటు ఇతర ప్రధాన సిటీల్లోనూ ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపింది.
News January 12, 2026
ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ రూ.2,653 కోట్ల డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,110 కోట్లు, పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు రూ.110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, CRIF పనులకు రూ.1,243 కోట్లు, నీరు-చెట్టు బిల్లులకు రూ.40 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తంగా 5.7 లక్షల మందికి బిల్లులు, బకాయిలు చెల్లించింది.
News January 12, 2026
తొక్కిసలాట బాధ్యత టీవీకేది కాదన్న విజయ్!

కరూర్ <<17852847>>తొక్కిసలాట<<>>కు టీవీకేది బాధ్యత కాదని ఆ పార్టీ అధినేత విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో CBI <<18836427>>ఆయన్ను<<>> 6 గంటలు విచారించింది. విషాదం తీవ్రత పెరగకుండా తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారని సమాచారం. ‘విజయ్‌ను ప్రశ్నించడం ముగియలేదు. పండుగ నేపథ్యంలో వాయిదా వేయాలని ఆయన కోరారు. పొంగల్ తర్వాత ఆయన్ను మరోసారి పిలుస్తాం’ అని CBI వర్గాలు తెలిపాయి.


