News December 18, 2025
పోలింగ్‌లో మెదక్ జిల్లాకు 5వ స్థానం

జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.37 శాతం పోలింగ్ నమోదై రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయమన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా ముగించడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పోలీసు యంత్రాంగం, పాత్రికేయులకు అభినందనలు తెలియజేశారు.
Similar News
News January 14, 2026
మెదక్: యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 10వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్‌కు దూరం, తాగునీటి సౌకర్యం, ర్యాంపులు, ఇతర ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
News January 14, 2026
జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.
News January 14, 2026
మెదక్: జిల్లాను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ టేబుల్, వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రెసిడెంట్ విట్టల్, సెక్రటరీ నాగభూషణం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ట్రెజరర్ ఎల్లయ్య ఉన్నారు.


