News December 18, 2025

రేగొండ: డబుల్ మర్డర్ కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష

image

రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డబుల్ మర్డర్ కేసులో ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కంచరకుంట్ల రాజు @ రాజిరెడ్డి(45)ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, అతడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.1,000 జరిమానా విధించింది. ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.

Similar News

News January 12, 2026

బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్కే ఆలీ ఆజగర్

image

బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్కే ఆలీ అజగర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అజగర్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని అధికారికి కలెక్టర్ సూచించారు.

News January 12, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు

image

TG: మున్సిపాలిటీల్లోని తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 631 మంది ఇతర ఓటర్లున్నట్లు తుది జాబితాలో వెల్లడించింది. కాగా ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

News January 12, 2026

సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

image

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.