News December 18, 2025

SRD: ‘రాజీతో ఇరు వర్గాలు గెలుపొందినట్లే’

image

క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకోవడానికి ఈనెల 21న అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుందన్నారు.

Similar News

News January 12, 2026

యాదాద్రి: వారిపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

సాంకేతికత దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధమని, జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి జమ చేసిన ఫైల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై విచారణకు అదేశించారు.

News January 12, 2026

మరోసారి పాక్ డ్రోన్ల కలకలం

image

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో LoC వెంబడి ఇవాళ సాయంత్రం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మరికొన్ని కనిపించినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఆయుధాలు/డ్రగ్స్ జారవిడిచారనే అనుమానంతో సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాయి. సాంబా సెక్టార్‌లో నిన్న డ్రోన్ ద్వారా పాక్ వెపన్స్ <<18815524>>డ్రాప్ చేయడం<<>> తెలిసిందే.

News January 12, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ పబ్లిక్ టాక్

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. చిరు ఎంట్రీ అదిరిపోయిందని, ఫస్ట్ ఫైట్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేస్తుందని ఆడియన్స్ చెబుతున్నారు. కామెడీ బాగుందని, అనిల్ రావిపూడి రెగ్యులర్ స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొన్ని చోట్ల రొటీన్, సాగదీత సీన్లు ఉన్నాయంటున్నారు. రేపు ఉదయం Way2Newsలో ఫుల్ రివ్యూ&రేటింగ్.