News December 18, 2025

జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు డిసెంబర్ 22లోగా సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతర నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. పంచాయతీ రోడ్ల మరమ్మతులు, క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలు డిసెంబరు 22లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. స్టాండ్ బై ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News January 13, 2026

ఊర్లలో.. ఏదైనా ప్లాన్ చేద్దాం.. ట్రెండింగ్ టాపిక్!

image

పండుగకు అంతా వస్తుండటంతో ఊర్లు సందడిగా మారాయి. ఇరుగు-పొరుగు, బంధువులు, ఫ్రెండ్స్ కుశల ప్రశ్నలతో కోలాహలం కన్పిస్తోంది. ఇన్నాళ్లూ.. ఎదుటి వారి నుంచి ‘ఏం చేస్తున్నారు?’ అనే ప్రశ్నలు సాధారణంగా వచ్చేవి. ఈసారి ‘ఇక్కడే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దామా?’ అని ప్లాన్స్, డిస్కస్ చేస్తున్నట్లు చాలా ఊర్ల నుంచి సమాచారం. మీ సర్కిళ్లోనూ పిచ్చాపాటితో పాటు ఈ చర్చలు జరుగుతున్నాయా? కామెంట్.

News January 13, 2026

‘భూభారతి’లో బకాసురులు!

image

TG: భూభారతి పోర్టల్‌ ద్వారా జరిగిన <<18815490>>అక్రమాల<<>> తీగ లాగితే డొంక కదులుతోంది. భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా మీసేవ, ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు స్టాంప్ డ్యూటీ, ఛార్జీలను నొక్కేసినట్లు గుర్తించారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారి బస్వరాజుతో పాటు పాండు, గణేశ్ సహా 14మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. రూ.50Cr స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది.

News January 13, 2026

బాధితులకు రూ.25వేల సాయం ప్రకటన

image

AP: కాకినాడ(D) సార్లంకపల్లె <<18842252>>అగ్నిప్రమాదం<<>>పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ.25వేలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం వసతి, ఇతర సహాయాలు అందించాలని సూచించారు. కాగా నిన్న సార్లంకపల్లెలో 40 తాటాకు ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన విషయం తెలిసిందే.