News April 21, 2024

సీయూఈటీ పరీక్ష తేదీలు విడుదల

image

సీయూఈటీ-యూజీ 2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మే 15 నుంచి మే 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Similar News

News March 15, 2026

మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు: వైసీపీ

image

AP: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన <<19386182>>డ్రగ్స్ పార్టీలో<<>> టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోందని మండిపడింది. ‘మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి’ అంటూ అనిత, చంద్రబాబు, పవన్, లోకేశ్‌ను ట్యాగ్ చేసింది.

News March 15, 2026

నెతన్యాహును వేటాడి మరీ చంపేస్తాం: IRGC

image

నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని IRGC హెచ్చరించింది. మరోవైపు నెతన్యాహు చేతికి ఆరువేళ్లు ఉన్నాయని.. అది <<19382555>>AI వీడియో<<>> అని ఇరాన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది AI వీడియో కాదని, లైటింగ్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడి అలా ఒక వేలు ఎక్స్‌ట్రా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.

News March 15, 2026

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

image

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్‌ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్‌ (లేదా) 2mlహెక్సాకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్‌ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేయాలి.