News December 18, 2025
కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ చిన్ని భేటీ

విజయవాడ పార్లమెంటు పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు కలిశారు. గొల్లపూడిలో శాటిలైట్, హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు, కొండపల్లి, విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
Similar News
News January 2, 2026
‘కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలి’

కడప జిల్లాలో శతాబ్ద కాలం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమను తక్షణమే పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు కన్యతీర్థం వద్ద ఉక్కు శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. కడప జిల్లా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతమని, పరిశ్రమల లేమివల్ల యువతకు ఉపాధి ఉంటుందన్నారు.
News January 2, 2026
పెద్దపల్లి: ‘ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధిహామీ పనులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఏఈలు ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.
News January 2, 2026
ఐడియా చెప్పండి.. రూ.2లక్షలు గెలుచుకోండి!

ఆధార్ డేటా విశ్లేషణ ద్వారా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు UIDAI ‘నేషనల్ డేటా హ్యాకథాన్ 2026’ నిర్వహిస్తోంది. డేటా ఆధారిత పరిష్కారాలను చూపే విద్యార్థులు, టెక్ నిపుణులు ఇందులో పాల్గొనవచ్చు. ఉత్తమ ఐడియాలకు మొదటి బహుమతిగా రూ. 2లక్షలు, సెకండ్ రూ. 1.5 లక్షలు, 3rd రూ.75వేలు, ఫోర్త్ రూ.50వేలు, 5thకు రూ.25వేలు నగదు లభిస్తుంది. ఈనెల 5 నుంచి UIDAI వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


