News December 18, 2025
GDDPలో మొదటి స్థానంలో విశాఖపట్నం

జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో విశాఖ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి అర్ధ సంవత్సరంలోని (ఏప్రిల్-సెప్టెంబరు) జీడీడీపీ లెక్కల ఆధారంగా ఆయా జిల్లాల ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 59,557 కోట్ల జీడీడీపీతో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. అనకాపల్లి జిల్లా జీడీడీపీ రూ.30,189 కోట్లు కాగా.. రూ.6646 కోట్లతో అల్లూరి జిల్లా చివరి స్థానంలో ఉంది.
Similar News
News January 12, 2026
అనంతపురం జిల్లా JC బదిలీ

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 12, 2026
అక్కడ 16 ఏళ్లలోపు వారికి నో SM… మనదగ్గర?

16 ఏళ్లలోపు పిల్లలకు DEC 10 నుంచి SMను ఆస్ట్రేలియా నిషేధించడం తెలిసిందే. ఈ ప్లాట్ ఫారాలకు ఆ వయసులోపు వారిని దూరంగా ఉంచాలని లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియా సంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే మెటా 5,50,000 ఖాతాలను మూసివేసింది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ నుంచి 3,30,000, ఫేస్‌బుక్ 1,73,000, థ్రెడ్‌లో 40,000 ఖాతాలు రద్దయ్యాయి. మన దగ్గర కూడా ఇలా చేయాలని కోరుతున్నారు. మీరేమంటారు?
News January 12, 2026
GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.


