News December 18, 2025
వనపర్తి: రాజీ మార్గమే రాజమార్గం – ఎస్పీ సునీత రెడ్డి

వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి. ఒకవేళ ఇంతటితో కలిసి ఉంటామని ఒక నిర్ణయానికి వస్తే అప్పుడే సమస్యలు, వివాదాలు సమసిపోతాయని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీన వనపర్తి జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్‌లో రాజీ పడ దగిన కేసులను కక్షిదారులు న్యాయస్థానం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు.
Similar News
News January 16, 2026
ఎన్నికలప్పుడే రాజకీయం చేద్దాం: సీఎం

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా కాలంలో ప్రజాపాలన, అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజల సమస్యలకు పరిష్కారించడమేనన్నారు. అనవసర రాజకీయ విమర్శలకంటే పనితీరు, సంక్షేమ పథకాల అమలే ముఖ్యమని వివరించారు. నిర్మల్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు.
News January 16, 2026
రామభద్రపురంలో పండకొచ్చిన అల్లుడికి 101 వంటకాలతో విందు

రామభద్రపురం మండల కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన నూతన జంట పూసర్ల వెంకట సాయికుమార్, పద్మావతి దంపతులను అత్తవారు మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించారు. 101 రకాల వంటకాలను ఇవాళ తయారు చేసి పెద్ద అరటి ఆకులో కొత్త అల్లుడికి వడ్డించారు. ఇలా సంప్రదాయంగా వంటకాలు పెట్టిన బొడ్డు నాగ సైనకుమార్, సత్య దంపతులను పలువురు కొనియాడారు.
News January 16, 2026
WGL: మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. గిరిజన జాతరగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న సందర్భంగా మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.


