News December 18, 2025

MNCL: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

image

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయన్నారు. జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశం ద్వారా ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.

Similar News

News January 13, 2026

కొండాపూర్: ‘వేసవికి తగ్గట్టుగా బీరు ఉత్పత్తి చేపట్టండి’

image

కొండాపూర్ మండలం మల్లేపల్లి బీరు, మద్యం తయారీ కంపెనీలను ఎక్సైజ్ సెక్రెటరీ రఘునందన్ రావు, కమిషనర్ సి.హరికిరణ్ సోమవారం పరిశీలించారు. వేసవి అవసరాలకు తగ్గట్టుగా బీర్ కంపెనీలు తమ ఉత్పత్తులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బీర్ తయారీ విధానాన్ని పరిశీలించి పాటించావాల్సిన ప్రమాణాలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

News January 13, 2026

ఐఫోన్ యూజర్లకు అలర్ట్

image

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్‌డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్‌ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.

News January 13, 2026

దీపికకు రాష్ట్రపతి ఆహ్వానం

image

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఆహ్వానం అందింది. అమరాపురం(M) తంబలహట్టిలో దీపికకు ఈ ఆహ్వాన పత్రికను హిందూపురం తపాలా అధికారులు అందజేశారు. రాష్ట్రపతి ఆహ్వానం రావడంతో మండల వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ దీపికను అభినందించారు. ఇది గ్రామానికే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.