News April 21, 2024
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

నార్కెట్ పల్లి అద్దంకి రహదారిపై బొత్తలపాలెం వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిరికంటి సైదయ్య మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తల పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సైదులు విధులకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
Similar News
News November 14, 2025
NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News November 14, 2025
NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.
News November 14, 2025
NLG: 17 నుంచి పత్తి కొనుగోలు బంద్

సీసీఐ తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠిన నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది.


