News April 21, 2024
ఒంటిమిట్ట: 22న ట్రాఫిక్ ఆంక్షలు

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న జరగనున్న కళ్యాణోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కడప పట్టణం, ఒంటిమిట్ట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడప నుంచి తిరుపతి వెళ్లే వాహనాలు ఇర్కాన్ సర్కిల్, ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతికి వెళ్లాలని, తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు రావాలన్నారు.
Similar News
News March 13, 2026
వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు: జేసీ నిధి మీనా

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.
News March 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,770
➤ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,508
➤ వెండి 10 గ్రాముల ధర రూ.2,720.
News March 12, 2026
కడప: రేపు వైవీయూ కాన్వకేషన్ .. ఏర్పాట్లు పూర్తి

యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు లోపు విద్యార్థులు తిరుపతి బైపాస్ రోడ్డులోని డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందన్నారు. వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తామన్నారు.


