News December 18, 2025

సిబ్బంది పనితీరు అద్భుతం: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 566 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలతో పాటు 5,168 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసి, ఎన్నికలను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News January 21, 2026

ఖమ్మం: అనారోగ్యంతో సర్పంచ్ మృతి

image

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బోటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య తులసిరాం(45)అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ ఏకగ్రీవంగా బోటితండా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. తులసీరామ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News January 21, 2026

ఖమ్మం ఆర్టీసీకి రూ.19.80 కోట్ల ఆదాయం

image

సంక్రాంతి సందర్భంగా ఖమ్మం రీజియన్‌లో రికార్డు స్థాయిలో రూ.19.80 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 19 వరకు ఏడు డిపోల పరిధిలో 1,483 అదనపు సర్వీసులను నడిపామని తెలిపారు. డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా చేరవేశామని, అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆర్టీసీ యంత్రాంగం పేర్కొంది.

News January 21, 2026

జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 30 జంక్షన్ల వద్ద పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి జంక్షన్‌ వద్ద ప్రత్యేక నిఘా, మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.