News December 18, 2025
20న ఒంగోలులో వ్యాసరచన పోటీలు: DEO

ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నామని గెలిచిన విజేతలకు రూ.5000, రూ.3000, రూ.2000 బహుమతులు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.
Similar News
News January 7, 2026
కనిగిరి హత్య కేసులో మరో ట్విస్ట్.!

వెలిగండ్ల మండలంలోని కట్టకిందపల్లిలో మహిళను చంపి, ఆపై AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంగళవారం క్లూస్‌టీం రంగంలోకి దిగింది. సీనావలి, నాగజ్యోతి మృతదేహాలకు కనిగిరి ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. జ్యోతి మృతదేహాన్ని కట్టకిందపల్లికి తరలించేందుకు యత్నించగా మృతురాలి బందువులు న్యాయం చేయాలని పోలీసులను నిలదీశారు. వీరిరువురి మృతిపై <<18773256>>మూడవ వ్యక్తి ప్రమేయం<<>> ఉందేమోనని పోలీసులు ఆరాతీస్తున్నారు.
News January 7, 2026
ప్రకాశం: మోసంచేసి రన్నింగ్ బస్ దూకి మృతి

టంగుటూరుకు చెందిన మురళి చిలకలూరిపేట నుంచి ఒంగోలుకు RTC బస్సులో వస్తున్నాడు. జాగర్లమూడివారిపాలెంకి చెందిన గోపీనాథ్(24) అదే బస్సులో మేదరమెట్ల వద్ద ఎక్కాడు. తనకు రూ.200 ఫోన్‌పే చేయాలని మురళిని అడిగి కొడుతుండగా పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకున్నాడు గోపీ. మరోసారి మురళిని ఫోన్ అడిగి రూ.90వేలు ట్రాన్ఫర్ చేసుకున్నాడు. మురళి గమనించి అడగగా గోపీ రన్నింగ్ బస్ నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కాగా మంగళవారం చనిపోయాడు.
News January 7, 2026
మెరుగైన వసతుల కల్పనకు కృషి: కలెక్టర్

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించడంతోపాటు మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం రాదని, అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.


