News April 21, 2024

BREAKING: నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

image

AP: నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ 4 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. మడకశిర- ఎమ్మెస్ రాజు, ఉండి- రఘురామకృష్ణరాజు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకి అవకాశం కల్పించింది. కాసేపట్లో అభ్యర్థులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు బీఫాంలు అందజేయనున్నారు. నామినేషన్లకు ముందు ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News March 10, 2026

గ్యాస్ నిల్వలు తగ్గకుండా కేంద్రం కీలక నిర్ణయం

image

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చమురుశుద్ధి సంస్థలపై Essential Commodities Act ప్రయోగించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. LPG ఉత్పత్తి పెంచాలని ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదేశించింది.

News March 10, 2026

USకు జెలెన్‌స్కీ సాయం.. కాలం కలిసి రావడం అంటే ఇదే!

image

‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి’ అన్నట్లు జియోపాలిటిక్స్ మారిపోయాయి. ఏడాది క్రితం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీని ఎగతాళి చేసిన ట్రంప్ ఇప్పుడు అదే ఉక్రెయిన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇరాన్ డ్రోన్లతో అమెరికా రక్షణ వ్యవస్థలు దెబ్బతింటుంటే వాటిని కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ నైపుణ్యం ఇప్పుడు USకు అవసరమైంది. మిస్సైళ్ల కోసం అర్థించిన జెలెన్‌స్కీ నేడు అమెరికాకు రక్షణ వ్యవస్థ అందించే స్థాయికి చేరారు.

News March 10, 2026

UAEలో రియల్ ఎస్టేట్ ఢమాల్.. గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిన ధర

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని అల్-జుబైల్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర ఒక గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. కాగా ఇరాన్ ఇప్పటివరకు యూఏఈపై వెయ్యికి పైగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో బిలియనీర్లు సేఫ్టీ కోసం దుబాయ్ వదిలి సింగపూర్‌కు షిఫ్ట్ అయి అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.