News December 18, 2025
MBNR: 19న “FSSAI లైసెన్స్,రిజిస్ట్రేషన్ మేళా”

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారి నీలిమ తెలిపారు. ఈ మేళా మహబూబ్ నగర్ నందు ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం(IDOC) గది నెం.218లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 81212 59373, 70134 83730 నంబర్లకు సంప్రదించాలన్నారు.
Similar News
News January 13, 2026
MBNR: సిరి వెంకటాపూర్‌లో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకద్రలో 15.5, కొల్లూరులో 17.9, కౌకుంట్ల 18.0, సల్కర్‌పేటలో 18.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన కొద్దిరోజులతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో జిల్లా ప్రజలకు చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది.
News January 12, 2026
కేటీఆర్ పాలమూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. HYD నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి MBNRకు చేరుకుంటారు. 11 గంటలకు పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లాలో నూతనంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు.
News January 12, 2026
మహబూబ్‌నగర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

కోయిల్‌కొండ మండలంలోని పారుపల్లిలో పొలంలో విద్యుత్ తీగలు సరి చేసేందుకు వెళ్లి ఓ రైతు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లపు తిరుపతయ్య (47) బోర్‌కు విద్యుత్ సరఫరా కావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగలను సరి చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


