News December 18, 2025

భూపాలపల్లి: 23 ఏళ్లకే సర్పంచ్

image

జిల్లాలోని కాటారం మండలం గుమ్మలపల్లి సర్పంచ్‌గా 23 ఏళ్ల భక్తు శరత్ కుమార్ ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మహదేవపూర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శరత్, పిన్న వయస్కుడైన సర్పంచిగా గుర్తింపు పొందారు. రాజకీయాల ద్వారా గ్రామాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని శరత్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News

News January 11, 2026

NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

image

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్‌లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.

News January 11, 2026

సంక్రాంతి లోపు రైతులకు ధాన్యం డబ్బులు: మంత్రి కొండపల్లి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తిచేసి, సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను శనివారం ఆదేశించారు. విజయనగరం జిల్లాకు అదనంగా కేటాయించిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు సమీప జిల్లాల్లో అమ్ముకునేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో సమస్యలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

News January 11, 2026

నితీశ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్‌లు ఈ మేరకు బహిరంగంగా మద్దతు తెలిపారు. రెండు దశాబ్దాలుగా బిహార్ అభివృద్ధికి నితీశ్ చేసిన కృషి ఆయనను భారతరత్నకు అర్హుడిని చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో జేడీయూ నేత కేసీ త్యాగి సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.