News December 18, 2025

రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది: హరీశ్ రావు

image

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ ద్వారా విమర్శించారు. రోజురోజుకూ అధికారం చేజారిపోతుందనే సత్యం జీర్ణం కాక రేవంత్ అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. తన పతనం తప్పదనే భయంతోనే ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుర్చీ ఊడుతుందనే ఆందోళనలో రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Similar News

News January 10, 2026

కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న హౌస్ అరెస్ట్

image

కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. సోమశిల జలాశయం సందర్శనకు వెళుతున్న సందర్భంగా ఆయనకు నోటీసులు అందించినట్లు సమాచారం. ఈ నోటీసులు అందజేయడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

News January 10, 2026

‘భూ భారతి’ ఛార్జీల చెల్లింపు అక్రమాలపై విచారణకు ఆదేశం

image

TG: ‘భూ భారతి’ రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో <<18804858>>అక్రమాలపై<<>> లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ&భూ పరిపాలన శాఖ అధికారులకు నిర్దేశించింది. ఈ స్కామ్‌లో యాదగిరిగుట్టకు చెందిన ఓ మీ సేవ నిర్వాహకుడే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. పోర్టల్‌కు నకిలీ ప్రింటర్ యాప్‌ను జోడించి తప్పుడు రశీదులు సృష్టించినట్లు సమాచారం.

News January 10, 2026

మామునూర్ ఎయిర్ పోర్టు రన్ వేలో 3 రోడ్లు!

image

మామునూర్ ఎయిర్ పోర్టు రన్ వే పొడిగింపు కారణంగా R&B రోడ్లు 1.97కి.మీ. పోతున్నాయి. రంగశాయిపేట, చింతనెక్కొండ రోడ్డు 670 మీటర్లు, గుంటూర్‌పల్లి-దూపకుంట పంచాయతీ రాజ్ రోడ్డు 800మీ, గాడిపల్లి-కాపుల కనపర్తి గ్రేటర్ కార్పొరేషన్ రోడ్డు 500 మీ. మొత్తం 1.97 కి.మీ రోడ్డు రన్ వే కారణంగా పోతోంది. ఈ 3 రోడ్ల కారణంగా రంగశాయిపేట-గాడిపల్లి మధ్య రోడ్డు క్లోజ్ అవుతోంది. ప్రత్యామ్నాయంగా మరో రోడ్డును ప్రతిపాదిస్తున్నారు.