News December 18, 2025
మచిలీపట్నం: తీర ప్రాంత రక్షణపై ఎంపీ బాలశౌరి కసరత్తు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం కేంద్ర భూమి, శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్‌తో భేటీ అయ్యారు. కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణం, చిన్నగొల్లపాలెం తీరప్రాంత కోత నివారణపై చర్చించారు. దీనిపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి DPR సిద్ధం చేయాలని, నిధుల కోసం విపత్తు నిర్వహణ సంస్థలను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ఈ చర్యలతో తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పించే అవకాశం ఉంది.
Similar News
News January 20, 2026
కృష్ణా: ‘ఇంటర్ పరీక్షలకు పకడ్బండీ ఏర్పాట్లు’

జిల్లాలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మూడు దశల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలు, వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షల కోసం 18 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News January 20, 2026
కృష్ణా జిల్లా కలెక్టర్‌కి అవార్డు

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టిసెస్ అవార్డును దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరగనున్న నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ ఈ అవార్డును అందుకోనున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అత్యధిక మంది కొత్త ఓటర్ల నమోదులో కలెక్టర్ చూపిన ప్రతిభకు గాను ఈ అవార్డు లభించింది.
News January 20, 2026
కృష్ణా SP పేరుతో డబ్బుల్ డిమాండ్

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేయడమే కాకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి డబ్బులు డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఎస్పీ పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని, ఎవరైనా డబ్బులు కావాలని మెసేజ్ చేసినా స్పందించవద్దని కోరింది. ఇటువంటి ఫేక్ ఐడీలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని DSP సీహెచ్ రాజా తెలిపారు.


